గుడ్డు గురించి అసలు నిజం బయటపెట్టిన డాక్టర్లు..!

ఈ ప్రపంచంలో..మంచి రుచికరమైన, సురక్షితమైన, పోషకాలన్నీ సమృద్ధిగా ఉన్న, చవకైన, చిటుక్కున వండుకోవటానికి వీలైన, అన్ని కాలాల్లోనూ దొరికే, అన్ని వయసుల వారికీ నచ్చే ఆరోగ్యకరమైన ఆహార పదార్థం ఏదైనా ఉందా సమాధానం ఒక్కటే గుడ్డు
పట్టుమని 50 గ్రాములు కూడా ఉండని ఒక్క చిన్న గుడ్డులో ఇన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టే ప్రపంచం యావత్తూ గుడ్డును అమింతంగా ఆస్వాదిస్తోంది. చాలామంది రుచిగా ఉండే ఆహారంలో పోషకాలుండవనీ, పోషకాలుండే ఆహారానికి రుచీపచీ ఉండవని భావిస్తుంటారు. కానీ రుచినీ, ఆరోగ్యాన్నీ.. రెంటినీ రంగరించి మనకందించే సహజ ఆహారం.. గుడ్డు

శారీరం కాల్షియంను గ్రహించడానికి గుడ్డు దోహదం చేస్తుంది. అంతేకాకుండా అస్తియో పోరోసిస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. గుడ్డులో ఉండే థెలినీయం, ఈ- విటమిన్ హృదయ సంబంధ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. రోజూ గుడ్డు తీంటే బరువు పెరుగుతారనే అపోహ ఉంది. కానీ ఇది నిజం కాదంటున్నారు న్యూట్రిషనిస్టులు. ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తీసుకుంటే అధికంగా ఉన్న బరువును 65శాతం తగ్గిస్తుంది. రోజుకు మూడు చొప్పున వారంలో రెండుసార్లు అలా 12 వారాల పాట్లు గుడ్లు తీసుకున్నట్లయితే అందమైన శరీరాకృతి మీ సొంతమవుతుంది. గుడ్డులో కోలెస్ట్రాల్ ఉన్నప్పటికీ నూనెలో వేయించిన పదార్థాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. అంతేకాకుండా రక్తంలోని కోలెస్ట్రాల్ శాతం పైన అతి తక్కువ ప్రభావం ఉంటుంది. గుండెపోటు వచ్చే అవకాశం కూడా తక్కువే. కాబట్టి నిరంభ్యంతరంగా మీ డైట్‌లో గుడ్డును తీసుకోండి.


మన ప్రాంతంలో చాలామంది బలం వస్తుందని పచ్చిగుడ్డు తాగేస్తుంటారు. అది సరికాదు. గుడ్డును ఉడికించి తినటమే మంచిది. రెండోది- తెల్లసొనలో ఎవిడిన్‌ అనే పోషకాహార నిరోధకం ఉంటుంది. ఇది బయోటిన్‌తో కలిసిపోయి దాన్ని శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటుంటుంది. గుడ్డును వేడిచేస్తే అది బయోటిన్‌ నుంచి విడిపోతుంది. గుడ్డులో ట్రిప్సిన్‌ అనే ఎంజైమ్‌ను పనిచేయకుండా చూసే నిరోధకం కూడా ఉంటుంది. వేడి చేసినప్పుడు ఇది కూడా నిర్వీర్యమవుతుంది. అందువల్ల గుడ్డును ఉడికించి, వండుకొనే తినటం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *