మునగాకు తింటే మగవారి శరీరంలో కలిగే మార్పులు తెలిస్తే…

మునగ  శాస్త్రీయ నామం మొరింగా ఓలీఫెరా. . ఇది విస్తృత ప్రయోజనాలున్న కూరగాయ చెట్టు. ఇవి సన్నగా పొడవుగా సుమారు 10 మీటర్ల ఎత్తు పెరిగి, కాండం నుండి కొమ్మలు వేలాడుతుంటాయి.దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ఈ చెట్టు ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో.. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. పంటగా కూడా సాగు చేసే మునగలోని మంచి గుణాలు తెలుసుకుందాం.

మునగ కాయలను  ద్రుమస్టిక్స్ అంటారు.. చెట్టులో అన్నిటికన్నా ఎక్కువగా ఉపయోగించే భాగం. వీటిని భారతదేశంలో చిక్కుడు మాదిరిగా వండుకుంటారు. కొన్నిసార్లు మునగ గింజల్ని వేపుకొని తింటారు. మునగ పువ్వులు పుట్టగొడుగులాగా రుచికరంగా ఉంటాయి.మునగాకులను పశువులకు దాణాగా ఉపయోగిస్తారు.మునగాకులు చాలా పుష్టికరమైన ఆహారం. వీనిలో బీటా కెరోటీన్, విటమిన్ సి, మాంసకృత్తులు, ఇనుము మరియు పొటాషియం ఎక్కువగా కలిగివుంటాయి. ఆకుకూరలు క్రింద వీటిని వివిధ రకాలుగా వండుకుంటారు. ఆకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి సూప్ లలోనూ సాస్ ల లోనూ ఉపయోగిస్తారు. మురుంగకాయ్ తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలలో ప్రక్రుతి  వైద్యంలో ఉపయోగిస్తున్నారు.

మునగ  విత్తనాలలో  సుమారు 40% వంట నూనె ఉంటుంది. . ఈ నూనె వాసనలేకుండా, క్లియర్ గా ఉంటుంది. నూనె తీయగా వచ్చిన పిప్పిని ఎరువుగానూ, నీటిని శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చును.మునగ  విత్తనాలను తీసి బాగా మెత్తగా రుబ్బి ఆ పదా ర్థాన్ని శుద్ధి చేయాల్సిన నీటిలో బాగా కలిపి ఒక గంట సేపు వుంచాలి. పిండితో పా టు బాక్టీరియా, మలినాలు అన్నీ నీటి అడుగుకు చేరుతాయి. పైన తేలిన నీటినివినియోగించుకోవచ్చు.

విటమిన్ ఎ, సి, సున్నము, పొటాషియం ఇందులో ఎక్కువగా వుంటాయి. ఆకును కూడా వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ కూడా వుంచుకోవచ్చు.అవసరమైనపుడు సంవత్సరం పొడవునా అందుబాటులో వుంటుంది. సి విటమిన్ తప్ప మిగిలిన పోషకాలేవీ నశించవు, తగ్గవు.వేరు క్రిమిసంహారిగాను, గనేరియా, సిఫిలిస్ వ్యాధులకు మంచి చికిత్స. ఆకులు, బెరడు, వాత, కంటి సమస్యలకు మంచి మందు.ఆకులు మంచి ఎరువు. పాడి పశువులకు ఆకులు బలవర్ధకం.

పాల ఉత్పత్తి 43-60 వరకు పెరుగుతుంది. మునగ మాను నుండి జిగురు పదార్థం లభిస్తుంది. వస్త్ర, తోలు పరిశ్రమలలోను, సౌం దర్య సాధనలోను దీన్ని విరివిగా వాడుతారు.మునగ పువ్వులు పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లో బాగా ఇష్టపడే రుచికరమైన ఆహారం.అన్నిటికీ మించి సెక్స్ సమస్యలకు మునగ దివ్యౌషధంగా పనిచేస్తుంది.మునగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెల రోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని అంగస్తంభన అవుతుంది.సెక్స్ సామర్థ్యం తగ్గితే మునగ పూలు, పాలలో వేసుకుని తాగాలి. ఇది ఆడవారికి, మగవారికి ఇద్దరికీ పనిచేస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *