రోగం రానివ్వని ఆహార పదార్థాలు… ఇవే..

రోగం రానివ్వని ఆహార పదార్థాలు… ఇవే.. ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పై శ్రద్ద చూపిస్తున్న వ్యక్తులు చాలా తక్కువనే చెప్పాలి… . ఆరోగ్యవంతమైన శరీరముంటే ఏ పనైనా సాధించవచ్చు. ఆరోగ్యముగా ఉండాలంటే మన రోగ నిరోధక వ్యవస్థ ను పెంచుకోవాలి . శరీరానికి తగినంత నిద్ర లేకపోవడం , సరిగా విశ్రాంతి తీసుకోనివారు, పొగ, మద్యం అలవాటు, వంటి అలవాట్ల వల్ల రోగనిరోధక వ్యవస్థ ఎక్కువగా దెబ్బ తింటుంది.

రోగనిరోధక వ్యవస్థ ను పెంపొందించుకోవాలంటే , సరైన సమయానికి ., సమపాళ్ళలో పోషక పదార్థాలను శరీరానికి అందించాలి. ఒక్కొక్క రకమైన పదార్థానికి ఒక విశిష్ట గుణము ఉంటుంది . మామిడి, బత్తాయి వంటి పండ్లు ద్వారా ఎ విటమిన్, నిమ్మ, ఉసిరి వంటి వాటిద్వారా విటమిన్ సి, కోడిగుడ్ల ద్వారా జింక్, ఐరన్, బాదం, కిస్మిస్ వంటి వాటి ద్వారా మేలు చేసే కొవ్వులు, చేపల ద్వారా అన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి.

మనం తినే ప్రతీరోజు ఆహారంలో ఆకుకూరలు మరియూ పెరుగు తప్పకుండా తీసుకోవాలి.వెల్లుల్లికి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడే శక్తి అధికంగా ఉంటుంది.ఆల్చిప్పలు వంటి సి ఫుడ్స్ ద్వారా ప్లూ వ్యాధిని నిరోధించే శక్తిని లభిస్తుంది… కావున జంక్ ఫుడ్ లాంటివి తగ్గించి ., ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలు తెలుసుకుని తీసుకోవడం మంచిది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *